బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబుల్
- December 28, 2017
ఆఫ్గాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నగరంలోని సాంస్కృతిక కేంద్రంవద్ద గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 40 మంది చనిపోయినట్లు ఆఫ్గాన్ హోంశాఖ వెల్లడించింది. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో విలేకరులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 'వెంటవెంటనే రెండు పేలుళ్లు సంభవించాయి. ఘటన జరిగిన సమీపంలో ఆఫ్గాన్ వాయిస్ ఏజెన్సీ ఉంది. దాని లక్ష్యంగా చేసుకునే దాడికి పాల్పడి ఉంటారు' అని హోంశాఖ అధికార ప్రతినిధి నజీబ్ దానిశ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే మరో పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో దాడి కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఘటన తామే చేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







