ఇడ్లీ ఫ్రై
- December 28, 2017
కావలసినవి:
ఇడ్లీలు: నాలుగు(చదరపు ముక్కలుగా కోయాలి), ఆవాలు: అరటీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, ఉల్లి ముక్కలు: అరకప్పు, టొమాటో ముక్కలు:అరకప్పు మిరియాలపొడి: పావుటీస్పూను, ఉప్పు: టీస్పూను, కారం: అరటీస్పూను, పసుపు: చిటికెడు, పెరుగు: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: సరిపడా
తయారుచేసే విధానం:
ఇడ్లీలను ముక్కలుగా కోయాలి.ఓ గిన్నెలో కారం, పసుపు, ఉప్పు, మిరియాలపొడి, పెరుగు వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఇడ్లీ ముక్కల్ని వేసి వాటికి పట్టేలా కలపాలి.బాణలిలో కొద్దిగా నూనె వేసి మిశ్రమం పట్టించిన ఇడ్లీ ముక్కలు వేసి వేయించి తీయాలి.మరో బాణలిలో ఆవాలు, కరివేపాకు వేసి అవి చిటపటమన్నాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి. వేగాక టొమాటో ముక్కలు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేయించి తీసిన ఇడ్లీ ముక్కల్లో వేసి కలిపి వేడివేడిగా వడ్డిస్తే ఇడ్లీ ఫ్రై రెడీ.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా