అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న షాప్‌లు
- December 28, 2017
మనామా: మనామా సౌక్‌లోని నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో రెండంతస్తుల భవనంలో చెలరేగిన అగ్ని ప్రమాదం కారణంగా పలు షాప్‌లు అగ్ని కీలల్లో చిక్కుకుపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ మాణి జరగలేదు. మనామా డౌన్ టౌన్‌లోని షేక్ అబ్దుల్లా రోడ్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ ఫైటింగ్ టీమ్స్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేశాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. 49 మంది సభ్యులుగల ఫైర్ ఫైటింగ్ టీమ్స్ 13 వాహనాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేశాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉందని సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







