'టచ్ చేసి చూడు' ఫస్ట్‌లుక్ విడుదల
- December 28, 2017
మాస్మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం టచ్ చేసి చూడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ ఈరోజు విడుదలైంది. ఇందులో బోల్తాపడిన కారు వద్ద రవితేజ కళ్లజోడు పెట్టుకుని స్టైల్‌గా నడిచొస్తున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాశీ ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. విక్రమ్ సిరికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోపక్క రవితేజ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాకి నేల టికెట్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇందులో రవితేజకి జోడీగా మాళవిక శర్మ నటించనున్నట్లు తెలుస్తోంది. జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారట.
తాజా వార్తలు
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!







