పవన్ పై కామెంట్ చేసిన కేటీఆర్

- December 29, 2017 , by Maagulf
పవన్ పై కామెంట్ చేసిన కేటీఆర్

ప్రజా సమస్యల ఫై ఎప్పటికప్పుడు స్పదించే తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కెటీఆర్..తాజాగా తన ట్విట్టర్ ల్లో సినీ స్టార్స్ పట్ల తన మనసులోని మాటలను తెలిపాడు. ట్విట్టర్ వేదిక గా పలువురు సినీ స్టార్స్ గురించి ఏమని చెపుతారని అడుగగా..దానికి కెటీఆర్.సమాదానాలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఎనిగ్మా అని తెలిపారు..ఎనిగ్మా అంటే ఆయన ఎవరికీ అర్థం కాని వ్యక్తి అని అర్థమట. జూనియర్ ఎన్టీఆర్ ని పెర్ఫార్మర్ అని, మహేష్ బాబును స్క్రీన్ ప్రెజెన్స్ లో సూపర్ స్టార్ అని, ప్రభాస్ ని బాహుబలి అని , తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ సమంత చాలా సున్నిత మనస్కురాలని చెప్పుకొచ్చారు. గురువారం తన ట్విటర్ లో ఆయన..సుమారు రెండు గంటలపాటు నెటిజన్లతో ఓపికగా లైవ్ చాట్ చేశారు. వారడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com