నాగచైతన్య కొత్త చిత్రం 'ధర్మాభాయ్'.!
- December 29, 2017
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం 'సవ్యసాచి' చిత్రంతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన.. దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఓ చిత్రం చేయబోతున్నట్లుటాలీవుడ్ వర్గాల సమాచారం. అక్కినేని నాగార్జునతో 'ఢమరుకం' తెరకెక్కించారు శ్రీనివాస్‌రెడ్డి.
నాగచైతన్యతో ఆయన తీయబోయే చిత్రానికి 'ధర్మాభాయ్' అనే టైటిల్‌ను పరిలిస్తున్నారట. 'ఢమరుకం' చిత్ర రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథ రాస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. మాధవన్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. జనవరి 4 నుంచి తర్వాతి షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







