8వ వేతన సంఘం అప్డేట్..
- February 25, 2026
న్యూ ఢిల్లీ: 8వ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు బలంగా ఉంచేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా నేడు (ఫిబ్రవరి 25, 2026) ఢిల్లీలో నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ భేటీలో 8వ వేతన సంఘానికి సమర్పించాల్సిన ఉమ్మడి విజ్ఞాపన పత్రానికి తుది రూపం ఇవ్వనున్నారు. ఈసారి ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో 3.25 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌తో పాటు 7 శాతం వార్షిక ఇంక్రిమెంట్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న 3 శాతం వార్షిక పెరుగుదల పెరిగిన ధరలకు అనుగుణంగా లేదని, అందుకే దీన్ని 7 శాతానికి పెంచాలని ఉద్యోగ నేతలు పట్టుబడుతున్నారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే, బేసిక్ శాలరీలో భారీ పెరుగుదల కనిపిస్తుంది. వేతన నిర్మాణం మరింత ప్రాక్టికల్‌గా మారుతుందని వారు వాదిస్తున్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందిస్తున్న ఈ నివేదికను 8వ వేతన సంఘం అధ్యక్షురాలు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్‌కు అందజేయనున్నారు. కుటుంబ యూనిట్‌ను ప్రస్తుతం ఉన్న 3 నుంచి 5కి పెంచాలని కూడా ఉద్యోగులు కోరుతున్నారు. కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటే, కనీస వేతనం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. దీనివల్ల బేసిక్ శాలరీలో దాదాపు 60 నుంచి 66 శాతం వరకు వృద్ధి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాల విషయంలోనూ కీలక మార్పులు కోరుతున్నారు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పరిమితిని 300 రోజుల నుంచి 400 రోజులకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, సీజీహెచ్ఎస్ సౌకర్యం లేని ప్రాంతాల్లో ఇచ్చే ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్‌ను రూ.1,000 నుంచి ఏకంగా రూ.20,000 కు పెంచాలని సూచిస్తున్నారు. తీవ్రమైన జబ్బుల చికిత్సకు ప్రస్తుతం ఇస్తున్న వెయ్యి రూపాయలు ఏమాత్రం సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్ పాలసీ, పాత పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరణ వంటి అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. అన్ని విభాగాల్లో సమానమైన ప్రమోషన్ నిబంధనలు ఉండాలని, రక్షణ శాఖ ఉద్యోగుల తల్లిదండ్రులను కూడా కుటుంబ యూనిట్లో చేర్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎన్పీఎస్ (NPS) కంటే పాత పెన్షన్ విధానమే ఉద్యోగులకు సామాజిక భద్రతనిస్తుందని సంఘాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ వారం రోజుల పాటు జరిగే చర్చల అనంతరం పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి చేరనుంది.
తాజా వార్తలు
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్‌లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్‌తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్‌లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్‌లో ఘోర ప్రమాదం







