వ్యక్తిని కొట్టి చంపిన కేసులో ఐదుగురి అరెస్ట్‌

- December 29, 2017 , by Maagulf
వ్యక్తిని కొట్టి చంపిన కేసులో ఐదుగురి అరెస్ట్‌

మస్కట్‌: ఐదుగురు వ్యక్తుల్ని ఓ హత్య కేసులో రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ అరెస్ట్‌ చేయడం జరిగింది. ఈ క్రమంలో, వారు హత్య చేసిన వ్యక్తి తాలూకు మృతదేహాన్ని ఘాలాలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి వెళ్ళిన పోలీసులకు రక్తపు మడుగులో చనిపోయిన ఉన్న ఓ వ్యక్తి మృతదేహం కన్పించింది. ఓ తగాదా ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్ట్‌ చేసిన నిందితుల్ని జ్యుడీషియల్‌ అథారిటీస్‌కి విచారణ నిమిత్తం అప్పగించారు. తీవ్రంగా గాయపర్చి, అతను చనిపోయాడని తెలుసుకున్న తర్వాత నిందితులు మృతదేహాన్ని దూరంగా విసిరేసినట్లు అనుమానిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com