కిటకిటలాడుతున్న దుబాయ్ మాల్స్
- December 31, 2017
దుబాయ్: గత ఏడాది భారతదేశంలో వెయ్యి , అయిదు వందల రూపాయల నోట్లు రద్దు అవుతుంటే ప్రజలు పలు బ్యాంకుల ముందు ఎలా బారులు తీరారో అలానే దుబాయ్ లో గత రెండు రోజులుగా నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాల ముందు కిక్కిరిసి ఉన్నారు. రేపు జనవరి 1 వ తేదీ నుంచి విలువ ఆధారిత పన్ను ( వ్యాట్ ) అమలవుతున్న నేపథ్యంలో సాధ్యమైనన్ని సరుకులు కొనుగోలు చేయడం మంచిదని నిత్యావసరాలు నిల్వ చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తడంతో పలువురు వినియోగదారులు దుకాణాలవైపు పరుగులుతీస్తున్నారు. రొట్టెలు పాలు పండ్లు కూరగాయలు తదితర ఆహారవస్తువులపై 75 శాతం డిస్కౌంట్ ఉందని వారు చెబుతున్నారు. జనవరి 1 నుంచి ప్రభుత్వం వ్యాట్ అమలుచేయబోతోందని దాంతో ఇంత కారుచౌకగా సరుకులు లభ్యం కావని వారు చెప్పారు. అయితే ప్రజలు ఎక్కువగా ఎల్ ఇ డి టీవీలు .. మైక్రో ఓవెన్లు ...వాషింగ్ మెషీన్లు..రిఫ్రిజిరేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైపర్ మార్కెట్స్ నుంచి చిన్న షాపింగ్ మాల్ అన్ని వినియోగదారులతో కిటకిటలాడిపోతున్నాయని నెటిజన్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







