అజ్ఞాతవాసి సెన్సార్ రిపోర్ట్ !
- January 01, 2018
పవన్ అభిమానులు మాత్రమే కాకుండా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'అజ్ఞాతవాసి' సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని U/A సర్టిఫికేట్ పొందినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో ఎమోషనల్ సెంటిమెంట్ తో పాటు అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉండడంతో సెన్సార్ వర్గాలు U/A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బయటకు వస్తున్న సెన్సార్ టాక్ ప్రకారం ఈమూవీలో పవన్ తన నట విశ్వరూపం చూపించాడని తెలుస్తోంది.
ముఖ్యంగా త్రివిక్రమ్ మాటలు మైండ్ వరకు వెళ్లి గుండెల్ని తకుతాయట. త్రివిక్రమ్ ప్రతి ఫ్రెమ్ ని చాలా వినోదాత్మకంగా తెరకక్కించడమే కాకుండా మంచి మెస్సేజ్ ఈసినిమాలో ఇచ్చాడని సెన్సార్ వర్గాలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఈ సినిమాలో ఎక్కడా అశ్లీలత లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ ఈసినిమాను తీసినదుకు సెన్సార్ బోర్డ్ సభ్యులు త్రివిక్రమ్ ను అభినందించినట్లు టాక్.
పవన్ తో పాటు ఇతర నటీనటుల పెర్ఫామెన్స్ కూడా ఈసినిమాకు హైలెట్ గా మారుతుంది అని అభిప్రాయ పడుతూ ఈమూవీలోని ఫైట్ సీన్స్ కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం అని సెన్సార్ సభ్యులు అభిప్రాయ పడినట్లు టాక్. ఇక ఈమూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈమూవీ ఓవర్సీస్ కు పంపించవలసిన కాపీలు లోడ్ చేసే కార్యక్రమం ప్రారంభం ఐనట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించిన కొత్త కొత్త పోస్టర్స్ ను ప్రతిరోజు విడుదల చేస్తూ పవన్ ఫ్యాన్స్ ను థ్రిల్ చేసే ఎత్తుగడలో ఈసినిమా యూనిట్ ప్రస్తుతం ఉంది.
నిన్న పవన్ కేసిఆర్ ను కూడ కలిసి ఆయన అనుసరిస్తున్న విధానాలకు మద్దతు తెలిపిన నేపధ్యంలో 'అజ్ఞాతవాసి' ప్రీమియర్ షోల విషయంలో తెలంగాణ ప్రాంతంలో ఇక ఎటువంటి అడ్డంకులు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఒకవైపు అజ్ఞాతవాసి' మ్యానియా మరొకవైపు పవన్ రాజకీయ దూకుడు వేగంగా ఉన్న నేపధ్యంలో ప్రస్తుతం సినిమా రాజకీయ వర్గాలలో అత్యంత హాట్ టాపిక్ గా పవన్ కళ్యాణ్ మారిపోయాడు..
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







