బాలయ్య తరువాతి సినిమా ఏంటో తెలుసా!
- January 02, 2018
'జై సింహా' తర్వాత బాలయ్య ఏం సినిమా చేస్తాడు? అనేది ఇప్పుడు బాలయ్య అభిమనుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న. ఎస్వీ కృష్ణారెడ్డి, అనిల్ రావిపూడి... ఇద్దరూ బాలయ్యను డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి యమ స్పీడ్ గా సినిమాలు చేసుకుపోతున్న నందమూరి నటసింహం తర్వాత అవకాశాన్ని ఎవరికి ఇస్తాడు? అనేది బాలయ్య అభిమానులంతా ఆసక్తికిగా ఎదురు చూస్తున్నారు. వీరి ఉత్కంఠకు తెర దించుతూ... 'జై సింహా' తర్వాత తాను నటించబోయే సినిమాను ఫిక్స్ చేసేశాడు బాలయ్య.
బాలయ్య తర్వాత నటించే సినిమా 'ఎన్టీయార్'. అవును.. తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కన్నున్న ఎన్టీయార్ బయోపిక్ నే ఆయన ఇమిడియట్ గా చేయనున్నాడు. ఈ సినిమాకు కారణజన్ముడు అనే టైటిల్ ని ముందు అనుకున్నా... ఆ తర్వాత 'ఎన్టీయార్' అనే పేరునే ఫిక్స్ చేశారు బాలయ్య.
మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. తేజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ వర్క్ జరిగింది. ఈ టీజర్ లో ఎన్టీయార్ రామకృష్ణా స్టూడియో, ఆయన వైభవం, ఆయన చైతన్య రథం..ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీయార్ వినియోగించిన కారు... వీటిని మాత్రమే చూపిస్తారని విశ్వసనీయ సమాచారం. వెనుక బాలయ్య వాయిస్ ఓవర్ ఉంటుంది.
మార్చి నుంచి సినిమా షూటింగ్ మొదలుపెట్టి...2019 సంక్రాంతికి విడుదల చేయాలనేది బాలయ్య ప్లాన్. ఈ సినిమాకు సంబంధించిన కథ సంగ్రహణ, స్క్రీన్ ప్లే, నిర్మాత అంతా బాలయ్యే. దర్శకత్వం తేజా, ఈ చిత్రానికి సంభాషణలు సాయిమాధవ్ బుర్రా రాస్తారు. అదనమాట విశేషం.
తాజా వార్తలు
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ







