భారతీయులకు గడ్డు కాలం

- January 02, 2018 , by Maagulf
భారతీయులకు గడ్డు కాలం

''బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌'' విజన్‌ కోసం ట్రంప్‌ కార్యాలయం తీసుకునే నిర్ణయాలతో భారీ మొత్తంలో భారతీయ వర్కర్లు వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ(డీహెచ్‌ఎస్‌) ప్రతిపాదనలతో, హెచ్‌-1బీ వీసాలు కఠినతరం కావడం, గ్రీన్‌ కార్డు అప్లికేషన్లు పెండింగ్‌లో పడటం వంటివి చోటుచేసుకుంటున్నాయి. దీంతో వేలకొద్దీ భారతీయ ఉద్యోగులు అమెరికా నుంచి భారత్‌కు వచ్చేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలుస్తోంది. ఎక్కువగా ఐటీ రంగంపై ఈ ప్రభావం ఉండనున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

భారతీయ వర్కర్లకు హెచ్‌-1బీ వీసాల అప్లికేషన్లకు గడువు పొడిగింపు కష్టతరం కావడంతో పాటు, శాశ్వత సభ్యత్వం కోసం పొందే  గ్రీన్‌కార్డులు దరఖాస్తులు పెండింగ్‌లు పడుతున్నట్టు తెలిసింది. ఇప్పటివరకున్న నిబంధనలతో గ్రీన్‌ కార్డు ఆమోదం పొందలేని పక్షంలో హెచ్‌-1బీ వీసాలకు రెండు మూడేళ్ల పొడిగింపును ట్రంప్‌ కార్యాలయం చేపడుతోంది. కానీ డీహెచ్‌ఎస్‌ ప్రతిపాదనలతో హెచ్‌-1బీ వీసాల పొడిగింపు కష్టతరంగా మారుతోంది. దీంతో 50వేల నుంచి 75 వేల వరకు భారతీయ హెచ్‌-1బీ వీసా హోల్డర్స్‌ తిరిగి స్వదేశానికి రావాల్సి వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. వీసా సంబంధిత సమస్యలపై సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రి బాడీ నాస్కామ్‌, అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్‌మెన్‌, అడ్మినిస్ట్రేషన్‌తో ఎప్పడికప్పుడూ చర్చలు జరుపుతూనే ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com