'బెగ్గర్ ఫ్రీ సిటీ' కి సహకరించండి...రూ 500 పట్టండి

- January 04, 2018 , by Maagulf
'బెగ్గర్ ఫ్రీ సిటీ' కి సహకరించండి...రూ 500 పట్టండి

హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీ (యాచక రహిత నగరం)గా మార్చే దిశగా పోలీసులు ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో మరో రెండు నెలలపాటు బిచ్చగాళ్లపై నిషేధం విధిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7 నుంచి మార్చి 8 వరకు యాచకులపై నిషేధం విధించినట్లు సీపీ శ్రీనివాసరావు తెలిపారు. నగరంలో బిచ్చగాళ్ల సమాచారమిచ్చిన వారికి రూ.500 పారితోషికం అందజేస్తామన్నారు. బిచ్చగాళ్ల సమాచారాన్ని 040 24511791, 040 24527846 నంబర్లకు తెలియజేయాలన్నారు. జంక్షన్లలో బిచ్చగాళ్లు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్న దృష్ట్యా యాచకులను ఇప్పటికే చంచల్‌కూడ, చర్లపల్లి జైళ్ల ఆశ్రమాల్లో పెట్టిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com