కోలీవుడ్ లోనూ సంక్రాంతి సందడి.. నాలుగు సినిమాలు రిలీజ్
- January 05, 2018
టాలీవుడ్లో ఈ సారి సంక్రాంతికి నాలుగు సినిమాలు సందడ చేయబోతున్నాయి. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, బాలకృష్ణ జై సింహా, రాజ్ తరుణ్ రంగుల రాట్నంతో పాటు డబ్బింగ్ చిత్రం గ్యాంగ్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఫైట్ చేసుకుబోతున్నాయి. ఈ సినిమాలన్నింటి మీద పాజిటివ్ బజ్ ఉండటం విశేషం.
టాలీవుడ్ మాదిరిగానే కోలీవుడ్లోనూ ఈ సంక్రాంతికి బిగ్ ఫైట్ జరగబోతుంది. తమిళ్ లో క్రేజ్ ఉన్న నాలుగు చిత్రాలు కోలీవుడ్ బాక్సాఫీస్ బరిలో పోటీకి రెడీ అయ్యాయి. వాటిల్లో గులేబగావళి ఒకటి. ప్రభుదేవా, హన్సిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంపై క్యూరియాసిటీ ఉంది. ఆల్ రెడీ రిలీజైన సాంగ్ ప్రోమోస్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.
ఇక స్టార్ హీరో సూర్య నటించిన తానా సెరంద కూట్టమ్ కోలీవుడ్లో ఈ నెల 12న విడుదలవుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్. ఇప్పటికే అనిరుథ్ మ్యూజిక్ అందించిన సాంగ్స్ మంచి కిక్ ఇచ్చాయి. టీజర్, ట్రైలర్ తో సూర్యా బాగా ఇంప్రెస్ చేశాడు.
ఈ నెల 12నే మరో స్టార్ హీరో విక్రమ్ కూడా తన సినిమాతో పోటీకి దిగుతున్నాడు. విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ స్కెచ్ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇందులో విక్రమ్ కి జోడీగా తమన్నా నటించింది. తమన్ అందించిన సాంగ్స్ కి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీపై తమిళతంబీలు చాలా ఆశలు పెట్టుకున్నారు.
సింగం సూర్య, చియాన్ విక్రమ్, డాన్సింగ్ స్టార్ ప్రభుదేవాతో పాటు సీనియర్ హీరో అరవింద్ స్వామి కూడా ఈ సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. అరవింద్ స్వామి, అమలాపాల్ కాంబినేషన్లో తెరకెక్కిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం కూడా సంక్రాంతి బరిలో ఉంది. ఈ మూవీ మీద కూడా అంచనాలున్నాయి. మరి కోలీవుడ్ సంక్రాంతి పందెంలో ఏయే సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







