ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- November 04, 2025
తిరుపతి: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలను మంగళవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. గోశాల నిర్వహణ, గోవులకు అందుతున్న దాణా, వసతి, వైద్యం, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలను టిటిడి ఈవోకు ఇంఛార్జీ డైరెక్టర్ డి.పణికుమార్ నాయుడు వివరించారు. దాదాపు 500 గోవులకు ఆధునిక వసతులతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనాన్ని, గోశాలలో గోవులు, పేయ దూడలు ఉంటున్న షెడ్లను పరిశీలించారు.గోశాలలో పశువుల సంఖ్య, దాణా మిక్సింగ్ ప్లాంటు, అగరబత్తిల యూనిట్ వంటి కార్యాకలాపాలను ఈవో పరిశీలించారు. గోశాల, అగరబత్తిల యూనిట్ లోని సిబ్బందితో ఈవో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!







