నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- November 04, 2025
మక్కా: ముస్లిం-మైనారిటీ దేశాల యాత్రికుల కోసం హజ్ 2026 సీజన్ ప్రారంభమైంది. యాత్రికులు అధికారికంగా నుసుక్ హజ్ ప్లాట్‌ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డైరెక్ట్ హజ్ ప్రోగ్రామ్ కింద రిజిస్ట్రేషన్ కోసం ఏకైక డిజిటల్ ప్లాట్‌ఫామ్ సుసుక్ అని తెలిపింది. ఇది ఆయా దేశాల నుండి అర్హత కలిగిన ముస్లింలు మధ్యవర్తులు లేదా ఏజెంట్లు ప్రమేయం లేకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఈ ప్లాట్‌ఫామ్, రిజిస్ట్రేషన్, ప్యాకేజీ ఎంపిక మరియు చెల్లింపు వంటి సమగ్ర డిజిటల్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొంది. ఇది సురక్షితమైన, సజావుగా మరియు పారదర్శక ప్రక్రియను నిర్ధారిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
యాత్రికులు hajj.nusuk.sa ని సందర్శించడం ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. హజ్ రిజిస్ట్రేషన్ లేదా చెల్లింపు సేవలను అందించే అనధికార లింక్‌లు, ఇతర కార్యాలయాలు లేదా మూడవ పార్టీల గురించి హెచ్చరించింది. నుసుక్ హజ్ ద్వారా ఆమోదించబడిన లైసెన్స్ పొందిన సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే బుకింగ్‌లను చేయడానికి అర్హులు అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







