ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- November 04, 2025
దోహా: ఖతార్ లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సివిల్ సర్వీస్ మరియు గవర్నమెంట్ డెవలప్‌మెంట్ బ్యూరో అధ్యక్షుడు మరియు నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ నాజర్ బిన్ ముబారక్ అల్ ఖలీఫా తెలిపారు. ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి రేటు 58 శాతం నుండి 86 శాతానికి పెరిగిందని ఆయన వెల్లడించారు.
నవంబర్ 4 నుండి 6 వరకు ఖతార్ నిర్వహిస్తున్న రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సులో భాగంగా నిర్వహించిన ప్యానెల్ చర్చలో ఆయన పాల్గొన్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వ సేవలపై సంతృప్తి స్థాయిని 90 శాతానికి పైగా పెంచడానికి కృషి చేయనున్నట్లు ఆయన అన్నారు. ప్రభుత్వ సేవలపై ఫీడ్ బ్యాక్ అందించేందుకు వేదిక అయిన “షేరెక్” ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఉత్తమ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించడాన్ని నియంత్రించే మానవ వనరుల చట్టం మరియు పౌర సేవా చట్టానికి చేసిన సంస్కరణల్లో భాగంగా ఈ వేదికను రూపొందించినట్టు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







