పీబీఎల్: చెన్నై స్మాషర్స్‌ను గెలిపించిన పీవీ సింధు
- January 06, 2018
హైదరాబాద్: మహిళల సింగిల్స్‌తో పాటు నిర్ణయాత్మక మిక్స్డ్ డబుల్స్ పోరులో సింధు రాణించడంతో చెన్నై స్మాషర్స్ విజయం సాధించింది. ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో శనివారం చెన్నై స్మాషర్స్ జట్టు 2-1తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌పై విజయం సాధించింది.
మొదట పురుషుల డబుల్స్‌లో రెకినాల్డ్-నందగోపాల్ జంట 15-13, 15-12తో క్రిస్ అడకాక్- యాంగ్లీ జోడీపై నెగ్గడంతో అహ్మదాబాద్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో సింధు 15-11, 10-15, 15-12తో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (అహ్మదాబాద్)పై గెలవడంతో చెన్నై స్కోరు సమం చేసింది.
మూడో మ్యాచ్‌ను చెన్నై ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకోగా.. ఆ జట్టు ఆటగాడు లెవెర్డెజ్ 15-12, 12-15, 14-15తో సౌరభ్ వర్మ చేతిలో ఓడిపోయాడు. అయితే చెన్నై చివరి రెండు మ్యాచ్‌ల్లో పుంజుకుని పోరులో విజేతగా నిలిచింది. మరో సింగిల్స్ అహ్మదాబాద్‌కు 'ట్రంప్' కాగా... తనోంగ్సక్ (చెన్నై) 15-10, 12-15, 15-14తో ప్రణయ్‌పై గెలుపొందాడు.
స్కోరు 1-1తో సమంగా నిలిచిన ఈ దశలో పీవీ సింధు, సుమీత్ రెడ్డి జోడీ 15-14, 15-13తో రెగినాల్డ్- కమిలా జుల్ (అహ్మదాబాద్) జంటను ఓడించింది. దీంతో చెన్నై స్మాషర్స్ జట్టు 2-1తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌పై నెగ్గింది. ఆదివారం జరిగే పోరులో హైదరాబాద్ హంటర్స్‌తో అవధె వారియర్స్ తలపడుతుంది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!