దుబాయ్ షాపింగ్ ఫెస్టివ్‌ల్ కోసంజెట్ ఎయిర్‌వేస్ ఆఫర్

- November 20, 2015 , by Maagulf
దుబాయ్ షాపింగ్ ఫెస్టివ్‌ల్ కోసంజెట్ ఎయిర్‌వేస్ ఆఫర్

ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్.. వచ్చే ఏడాది జరగనున్న దుబాయ్ షాపింగ్ ఫెస్టివ్‌ల్ కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్నవారికి రాను, పోను టికెట్ ధరను రూ.29,395గా నిర్ణయించింది. ఈ ఆఫర్‌లోభాగంగా దుబాయ్ నగరాన్ని సైతం తిలకించవచ్చును. ఈ ఆఫర్ కింద మూడు రాత్రులు, నాలుగు రోజులపాటు దుబాయిలోని ప్రత్యేక హోటల్‌లో వసతిని ఏర్పాటు చేయనున్నది. ఈ ఆఫర్‌లో టిక్కెట్ బుక్ చేసుకున్నవారు వచ్చే జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1, 2016 మధ్యలో ప్రయాణం చేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ప్రతియేటా జనవరి-ఫిబ్రవరి మధ్యకాలంలో దుబాయ్‌లో జరిగే అతిపెద్ద షాపింగ్ ఉత్సవాలకు భారత్‌తోపాటు పలు దేశాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు వెళ్తుంటారు. వారికోసమే ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com