సెన్సార్ పూర్తి చేసుకొన్న "ఇగో"

- January 09, 2018 , by Maagulf
సెన్సార్ పూర్తి చేసుకొన్న

"ఆకతాయి" ఫేమ్‌ ఆశిష్‌ రాజ్, సిమ్రాన్‌ జంటగా రూపొందుతోన్న సినిమా "ఇగో". సుబ్రమణ్యం దర్శకత్వంలో విజయ్‌ కరణ్‌–కౌసల్‌ కరణ్‌–అనిల్‌ కరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఇవాళ పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికేట్ అందుకొన్న "ఇగో" చిత్రాన్ని జనవరి 19న విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "హిలేరియస్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రం "ఇగో". నవతరం ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం యువతరంతోపాటు పెద్దలకు కూడా నచ్చేలా సినిమా ఉంటుంది. ఆశీష్ రాజ్ హీరోగా ఒక మెట్టు ఎక్కుతాడు. సిమ్రాన్, దీక్షా పంత్ ల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించింది. అలాగే సాయికార్తీక్ సమకూర్చిన నేపధ్య సంగీతం సినిమాకి హెల్ప్ అవుతుంది. ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చి మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది" అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com