ఆ నటుడు నన్ను అనుభవించి వదిలేశాడు : హీరోయిన్ సంచలన వాఖ్యలు

- January 10, 2018 , by Maagulf
ఆ నటుడు నన్ను అనుభవించి వదిలేశాడు : హీరోయిన్ సంచలన వాఖ్యలు

సినిమా ఇండస్ట్రీ లో ప్రేమించడం , ప్రేమించిన తర్వాత పెళ్లిచేసుకోకుండానే విడిపోవడం ,పెళ్లి పెటాకులు అవ్వడం,పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం ఇవన్నీ మామూలే .అయితే ఇన్నాళ్లు పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఈ సంస్కృతి క్రమంగా భారతదేశంలోనూ విస్తరించింది. చిన్న నటులనుండి జరుగుతున్న ఈ సంఘటనలు పెద్ద స్టార్ ల మధ్యకూడా జరుగుతున్నాయి.హృతిక్ రోషన్ మరియు కంగనా రనౌత్ ల మధ్య జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం.అయితే ఇప్పుడు శాండిల్ వుడ్ లో జరిగిన ఒక సంఘటన తీవ్ర చర్చనీయాంశమయింది.

శాండిల్ వుడ్ లో ఒక సినిమా చేస్తున్న సమయంలో హీరొయిన్ రాధికా శెట్టి మరియు నటుడు అమిత్ మధ్య ప్రేమ చిగురించిందని ,దానికి అమిత్ కుటుంబసభ్యులు అనుమతి తెలుపకపోవడంతో తాము ఇద్దరం ఒక గుడిలో పెళ్ళి చేసుకున్నామని,పెళ్లి చేసుకున్న తరువాత నాలుగు సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉండి కాపురం చేశామని, తీరా నాలుగు సంవత్సరాలు నన్ను వాడుకున్న తర్వాత ఇంకో యువతితో పెళ్ళికి సిద్దమయ్యాడంటూ బెంగళూరులోని ఒక పోలీస్ స్టేషన్ లో హీరొయిన్ రాధికా శెట్టి నటుడు అమిత్ పై పిర్యాదు చేసింది.

అయితే నటుడు అమిత్ స్పందిస్తూ అసలు తాను రాధికా శెట్టిని వివాహం చేసుకోలేదని ,ఆమె అనవసరంగా నా మీద నిందలు మోపుతున్నదని ఆరోపించాడు.ఇదే విషయంపై వేధింపులు,బ్లాక్ మెయిల్ వంటి కేసుల పైన ఆయన అదే పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు కూడా తెలుపాడు .ఏది ఏమయినప్పటికీ వీరిరువురు కన్నడనాట పెద్ద తతంగాన్ని సృష్టించారు.పోలీసులు కేసు నమోదుచేసి విచారణను త్వరలోనే చేపడతామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com