పార్కింగ్ ఉల్లంఘనలకు 10,000 దిర్హామ్‌ల వరకు జరీమానా
- January 10, 2018
దుబాయ్:రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) - దుబాయ్, నగరంలో ట్రాఫిక్ స్మూత్‌గా ఉండటంలో ఎంతో శ్రద్ధ కనబరుస్తూ వస్తోంది. రోడ్లు కావొచ్చు, మెట్రో, ట్యాక్సీలు, బస్‌లు లేదా పార్కింగ్ కావొచ్చు ప్రతి విషయంలోనూ ఆర్టీఏ శ్రద్ధ అభినందనీయం. దుబాయ్ వాసుల్ని, అలాగే దుబాయ్ సందర్శకుల్ని ఆనందంగా ఉంచడంలో ఆర్టిఎ పాత్ర ఎంతో కీలకం. ఆర్టిఎతోపాటుగా ప్రజలూ సహకరిస్తే దుబాయ్ ఖ్యాతి మరింత పెరుగుతుంది. నిబంధనల్ని ఉల్లంఘించకుండా ఉండటమే నివాసితులు చేయాల్సిన పని. పార్కింగ్ ఫెసిలిటీస్‌కి సంబంధించి జరీమానాలు కేవలం నిబంధనల్ని ఎవరూ ఉల్లంఘించకుండా ఉండేందుకే. పార్కింగ్ టారిఫ్ చెల్లించకపోయినా, టిక్కెట్ కన్పించకపోయినా 150 అరబ్ ఎమిరేట్ దిర్హామ్స్ చెల్లించాల్సిందే. పార్కింగ్ టైమ్ దాటితే 100 దినార్స్, పార్కింగ్ ఫెసిలిటీ దుర్వినియోగానికి 200, నెంబర్ ప్లేట్ లేకుండా పార్కింగ్ చేస్తే 1,000, అనుమతి లేకుండా పార్కింగ్, టిక్కెట్ మెషీన్స్, జోన్ ప్లేట్లను తొలగిస్తే 10,000 దిర్హామ్స్ జరీమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







