మనామా:ఘనంగా ప్రవాసి భారతీయ దివస్
- January 10, 2018
మనామా: ఇండియన్ కమ్యూనిటీ, ప్రవాసి భారతీయ దివస్‌ని ఘనంగా నిర్వహించింది. ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియన్ అంబాసిడర్ అలోక్‌కుమార్ సిన్హా, ఎంబజీ సిబ్బంది కమ్యూనిటీ మెంబర్స్‌కి సీఫ్‌లోని ఎంబసీ పరిసరాల్లోకి ఆహ్వానించారు. బ్రాండ్ ఇండియాని విదేశాల్లో చాటి చెబుతున్నందుకుగాను కమ్యూనిటీ మెంబర్స్‌ని ఇండియన్ అంబాసిడర్ అభినందించారు. సౌతాఫ్రికా నుంచి తిరిగొచ్చాక, మహాత్మాగాంధీ ఫ్రీడమ్ స్ట్రగుల్‌ని కొత్త మలుపు తిప్పారనీ, స్వాతంత్య్రం సిద్ధించాక దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని అలోక్‌కుమార్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిలో ఎన్నారైలు కీలక భూమిక పోషిస్తున్నారనీ, ఈ బంధం ఇంకా గొప్పగా కొనసాగాలని ఆకాంక్షించారాయన. ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ ఆనంద్ ప్రకాష్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వంతో విదేశాల్లోని భారతీయుల బంధం మరింత బలపడేలా ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







