వర్మ చేతిలోని 'మొగలి పువ్వు'
- May 03, 2015
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి 'మొగలిపువ్వు' సృష్టించారు. రొమాన్సు, ఫ్యామిలీ డ్రామాతో కూడిన సైకాలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా 'మొగలిపువ్వు' తెరక్కించారు. తన తాజా చిత్రం 'మొగలిపువ్వు' ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు వర్మ. ఈ టైటిల్ ను మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ 'రగులుతోంది మొగలి పొద' నుంచి కాపీ కొట్టానని ట్విటర్ లో పేర్కొన్నారు. ప్రతి పెళ్లైన వాడి సెల్ ఫోన్ లో తన భార్యకి తెలియని సీక్రెట్లుంటాయ్ అంటూ పోస్టర్ పై ముద్రించారు. దీనికి వివరణ కూడా ఇచ్చారు. 'ప్రతి పెళ్ళైన మగాడూ బయట ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే టెంప్ట్ అవుతాడు. ప్రతి భార్య తన భర్తకేదైనా ఒక సీక్రెట్ ఎఫైర్ ఉందేమోనని భయపడుతూ వుంటుంది. ప్రతి పెళ్ళైన వాడి సెల్ ఫోన్ లో తన భార్యకి తెలియని సీక్రెట్ లు ఉంటాయి. ఎఫైర్ లు అనేవి పెళ్లి వ్యవస్థ పుట్టినప్పటినుంచీ వున్నాయి. కాని సెల్ ఫోన్లలో పాస్ వర్డ్ లు, వాట్స్అప్ లు, పేస్ టైం లు కెమెరాలు వగైరా వచ్చినప్పటి నుంచి అవి ఒక భయంకర స్థితికొచ్చేశాయి. టెక్నాలజీయే కాకుండా స్త్రీల పై అత్యాత్యచారాలని అరికట్టడానికి కొత్తగా వచ్చిన నిర్భయ లాంటి చట్ట సవరణలు స్త్రీ పురుష సంబంధాలలో భూకంపాలు పుట్టిస్తున్నాయి. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ తీసుకుని రాసిన కధే మొగలిపువ్వు' అని వర్మ తెలిపారు. ఇప్పటివరకు అండర్ వరల్డ్, హారర్ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు వివాహ సంబంధాల నేపథ్యంలో చిత్రాలు రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







