జిసిసి పాస్‌పోర్ట్‌ ర్యాంకింగ్స్‌: బహ్రెయిన్‌కి 4వ స్థానం

- January 10, 2018 , by Maagulf
జిసిసి పాస్‌పోర్ట్‌ ర్యాంకింగ్స్‌: బహ్రెయిన్‌కి 4వ స్థానం

మనామా: హెన్లీ గ్లోబల్‌ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌లో జిసిసి దేశాల కేటగిరీలో బహ్రెయిన్‌ నాలుగో స్థానం సాదించుకుంది. గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌లో బహ్రెయిన్‌ 63వ స్థానం దక్కించుకుంది. వీసా ఫ్రీ కేటగిరీలో ఓ దేశానికి చెందిన పౌరులు ఎన్ని దేశాల్ని సందర్శించారనే కోణంలో ఈ సర్వే జరుగుతుంది. గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌లో బహ్రెయిన్‌తోపాటు నాంబియా కూడా 63వ ర్యాంక్‌ దక్కించుకుంది. జిసిసి దేశాల్లో యూఏఈ తొలి స్థానంలో నిలిచింది. 133 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్‌ సౌకర్యం యూఏఈ కల్పిస్తోంది. కువైట్‌ 58వ స్థానంలోనూ, ఖతార్‌ 62వ స్థానంలోనూ, ఒమన్‌ 65వ స్థానంలోనూ, సౌదీ అరేబియా 67వ స్థానంలోనూ నిలిచాయి. బహ్రెయిన్‌ పౌరులు 75 దేశాలకు వీసా ఫ్రీ సౌకర్యంతో వెళ్ళేందుకు వీలుంది. గ్లోబల్‌ లిస్ట్‌లో జర్మనీ తొలి స్థానంలో నిలిచింది. 177 దేశాలకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పిస్తోంది. సింగపూర్‌ రెండో స్థానంలో, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌, నార్వే, స్వీడన్‌ మరియు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com