అజ్ఞాతవాసిలో వెంకీ సీన్స్ ను యాడ్ చేస్తున్నారు
- January 11, 2018
పవన్ కళ్యాన్ అజ్ఞాతవాసిలో వెంకటేష్ ఉంటున్నాడు అంటూ రిలీజ్ ముందు వార్తలు వచ్చాయి. సినిమా టైటిల్ కార్డ్ లో కూడా వెంకటేష్ కు థ్యాంక్స్ అంటూ వేశారు. తీరా సినిమా చూశాక మాత్రం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. పవన్ సినిమాలో వెంకటేష్ కమియో కాదు కదా పేరు కూడా ప్రస్థావించలేదు. మరి ఎందుకు వెంకటేష్ ను టైటిల్ కార్డ్ లో ఉంచారంటూ కామెంట్లు వస్తున్నాయి.
వెంకటేష్ ఈ సినిమాకు ఆఫ్ స్క్రీన్ సహాయం అందించి ఉంటారా అని ఆరా తీస్తున్నారు. అయితే వెంకటేష్ పవన్ మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయట. అవి వారం తర్వాత సినిమాలో యాడ్ చేస్తారని అంటున్నారు. నిన్న రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమాపై పవన్ ఫ్యాన్స్ సంతృప్తి చెందినా సగటు సిని ప్రేక్షకులు మాత్రం సినిమాను చూసి పెదవి విరుస్తున్నారు.
ఇక సినిమా లార్గో వించ్ కు కాపీ అయినా ఎందుకు త్రివిక్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టీసీరీస్ తో ఈ వ్యవహారం సెటిల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే టాక్ డివైడ్ గా రావడంతో వారం తర్వాత కలుపుదాం అనుకున్న సీన్స్ మరో రెండు రోజుల్లో యాడ్ చేస్తారని అంటున్నారు. ఇక పవన్ ను విమర్శించే వారికి అజ్ఞాతవాసి ఛాన్స్ ఇచ్చినట్టు అయ్యింది.
త్రివిక్రం పవన్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమాకు వస్తున్న ఈ విపరీతమైన కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్నాయి. మరి వెంకటేష్ సీన్స్ యాడ్ చేశాక అయినా సినిమా బాగుంటుందేమో చూడాలి. సినిమా అంచనాలను అందుకుంటే చరిత్ర సృష్టిస్తుందని భావించగా డివైడ్ టాక్ తో పవన్ కలక్షన్స్ మాత్రం అదరగొడుతున్నాడు. ఎలాగు ఈ వారం సంక్రాంతి హాలీడేస్ కాబట్టి సినిమా వసూళ్ల పరంగా బాగుండే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







