కేరళ సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు
- January 11, 2018
దిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. ఎస్‌ఎన్‌సీ-లావలిన్ అవినీతి కేసులో ఆయనకు నోటీసులు పంపింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విషయంలో సీబీఐ చేసిన అప్పీల్‌ను వినడానికి అంగీకరించింది. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం జోక్యం అవసరమని, నిందితులందరికీ నోటీసులు పంపాలని సీబీఐ తరపు న్యాయవాది.. అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరారు. సీబీఐ చేసిన అప్పీలును అంగీకరించిన కోర్టు నాలుగు వారాల్లోగా స్పందించాలని నిందితులకు నోటీసులు పంపింది.
కేరళలోని మూడు హైడ్రోఎలక్ర్టిక్ ప్రాజెక్టుల పునర్నిర్మాణ పనులకు సంబంధించి కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు, కెనడాకు చెందిన ఎస్‌ఎన్‌సీ లావలిన్ కంపెనీల మధ్య ఒప్పందాలు, లావాదేవీల విషయంలో అనినీతి జరిగిందని కేసు నమోదైంది.
ఈ కేసులో విజయన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో కేరళ హైకోర్టు విజయన్ వదిలేయడంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







