దక్షిణ ఇరాన్లో భూకంపం
- January 11, 2018
తెహ్రాన్ : కెర్మాన్ దక్షిణ ప్రాంతంలో భూమి కంపించినట్లు ఇరాన్ మీడియా అధికారులు పేర్కొన్నారు. రిక్టర్‌స్కేలుపై 5.1గా నమోదైనట్లు తెలిపారు. హొజిడెక్ గ్రామానికి 700 కిలోమీటర్లు, దక్షిణ తెహ్రాన్‌కు 400 మైళ్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టంకు సంబంధించి ఇంకా తెలియలేదని అన్నారు. భూమి కంపించగానే ఆ ప్రాంతవాసులు బయటకు పరుగులు తీసారని, మీడియా పేర్కొంది. కాగా, కెర్మాన్‌లో తరచూ భూకంపాలు వస్తుంటాయని, గతేడాది నవంబర్‌లో భూకంపం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ ఇరాన్లో వచ్చిన భూకంపం ధాటికి 600 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్లో చారిత్రాత్మక నగరమైన బామ్‌లో 2003లో వచ్చిన భూకంపం ధాటికి 26,000మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







