వలసదారులపై బీజేపీ వివక్షత చూపిస్తోంది : రాహుల్ గాంధీ
- January 14, 2018
బీజేపీ వివక్షాపూరితంగా ఆలోచిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇండియన్ మైగ్రెంట్ వర్కర్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందని మండిపడ్డారు. ఇండియన్ పాస్‌పోర్టులలో మార్పులు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించడంపై రాహుల్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు.
''భారతదేశ మైగ్రెంట్ వర్కర్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. ఈ చర్య బీజేపీకి ఉన్న వివక్షాపూరిత ఆలోచనా విధానాన్ని వెల్లడిస్తోంది'' అని రాహుల్ పేర్కొన్నారు.
ప్రభుత్వం శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ స్టేటస్ కోసం జారీచేసే పాస్‌పోర్టుల రంగు నారింజ వర్ణంలోకి మార్చుతున్నారు. విదేవీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ మాట్లాడుతూ ఇకపై పాస్‌పోర్టులోని చివరి పేజీ ఖాళీగా ఉంటుందని చెప్పారు. ఈసీఆర్ స్టేటస్ ఉన్న పాస్‌పోర్టు హోల్డర్లకు నారింజ రంగు పాస్‌పోర్టు జాకెట్ జారీ చేస్తామన్నారు. నాన్ ఈసీఆర్ స్టేటస్ ఉన్నవారికి గతంలో మాదిరిగానే నీలి రంగు పాస్‌పోర్టులు కొనసాగుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







