భారత మంత్రి కువైట్ సందర్శన : కార్మిక సమస్యలకు త్వరలో పరిష్కారం

- January 14, 2018 , by Maagulf
భారత మంత్రి కువైట్ సందర్శన : కార్మిక సమస్యలకు త్వరలో పరిష్కారం

కువైట్ :  కువైట్ లో భారతీయ కార్మికులు ఎదర్కొంటున్న చెల్లించని జీతాల సమస్య విషయమై భారత ప్రభుత్వం ఒక పరిష్కరం సూచిస్తుందని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ వి .కె. సింగ్ అన్నారు. గురువారం తన చర్చల్లో భాగంగా కువైట్  అధికారులతో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు ఇండియన్ కమ్యూనిటీ ఎదుట ప్రసంగించారు. ఈ సంక్షోభానికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కువైట్ లో భారత నూతన రాయబారి కె.జీవా సాగర్, ఛార్జ్  ' డి 'అఫ్ఫైర్స్ అండ్ అప్పెలేట్ అథారిటీ రాజ్ గోపాల్ సింగ్, ఫస్ట్ సెక్రటరీ కెకె పహెల్, సెకండ్ సెక్రటరీ (లేబర్) సిబి సంయుక్త, ఇతర రాయబార కార్యాలయ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com