జనవరి 25న విడుదల కానున్న 'పద్మావత్'
- January 14, 2018
పద్మావత్ చిత్రం జనవరి 25న విడుదల చేయనున్నట్లు భన్సాలీ ప్రొడక్షన్స్ ప్రకటించింది. హిందీ, తమిళ్, తెలుగు భాషాల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. పద్మావతి చిత్రానికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పద్మావతి టైటిల్‌ను పద్మావత్‌గా మార్చడంతోపాటు మరో నాలుగు షరతులు అంగీకరిస్తే యూ/ఏ సరిఫ్టికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ సినిమాలో దాదాపు 26 దృశ్యాలను కత్తిరిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదంటూ సీబీఎఫ్‌సీ చైర్మన్ ప్రసూన్‌జోషి ఇటీవలే ప్రకటన విడుదల చేశారు. సినిమా టైటిల్‌తో సహా మొత్తం అయిదు మార్పులు సూచించినట్టు స్పష్టంచేశారు. సినిమా ప్రారంభంలో డిైస్లెమర్ ప్రదర్శించటం, సతి ఆచారాన్ని ప్రోత్సహించేలా ఉండకూడదని, గూమర్ పాటను మార్చాలని సూచించినట్టు తెలిపారు. ఇందుకు చిత్ర నిర్మాతలు అంగీకరించినట్టు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







