చర్చిని డైనమైట్‌తో పేల్చేసిన చైనా ప్రభుత్వం
- January 14, 2018
దేశంలోని ప్రముఖ ఎవలంజికల్ చర్చిను చైనా ప్రభుత్వం డైనమైట్ బాంబుతో నేలకూల్చింది. దీంతో పలు క్రిస్టియన్ సంఘాలు చైనా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. మత స్వేచ్ఛ, మానవ హక్కులపై చైనా ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం లేదని అన్నాయి.
షాంగ్జీ ప్రావిన్సులో గల ది గోల్డెన్ ల్యాంప్‌స్టాండ్ చర్చి అత్యంత పురాతనమైనది. అధ్యాత్మిక జీవనాన్ని నియంత్రించేందుకు చైనా కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా చర్చిలను నేలకూల్చుతోంది. అయితే, చర్చిల వరుస కూల్చివేతల వెనుక చైనా ప్రభుత్వ భయాందోళనలు ఉన్నట్లు తెలుస్తోంది.
పాశ్చాత్య దేశాల సంస్కృతికి చెందిన క్రైస్తవ మత వ్యాప్తి దేశంలో జరిగితే భవిష్యత్‌లో కమ్యూనిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ కారణాన్ని పైకి చూపకుండా అధ్యాత్మికతపై నియంత్రణ పేరుతో క్రైస్తవ మతాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు చైనా ప్రభుత్వం యత్నిస్తోంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







