ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఇది 'నా లవ్‌స్టోరీ'
- January 14, 2018
రామ్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై తరుణ్, ఓవియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ఇది నా లవ్ స్టోరీ. ఈ మూవీకి రమేష్ గోపి దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.. ఈ మూవీకి ఎస్.వి.ప్రకాష్ నిర్మాత.ఈ మూవీని ఫిబ్రవరి 14వ తేదిన విడుదల చేస్తునట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.. ఈ సందర్భంగా హీరోతరుణ్ మాట్లాడుతూ, రెగ్యులర్ ప్రేమకథాచిత్రం కాదని అన్నారు. ఈ చిత్రంలో నేను మూడు గెటప్స్‌లో కనిపిస్తాను. అయితే ఇందులో త్రిపాత్రాభినయం చేశానా? మూడు కోణాలున్న పాత్ర చేశానా?
అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, సినిిమాటోగ్రఫీ, సంగీతం వంటివన్నీ చక్కగా కుదిరాయి. హీరోయిన్ ఓవియా చక్కటి అభినయాన్ని కనబరిచింది. ఈ చిత్రంలో ఎక్కువ పాత్రలు కూడా కనిపించవు. గోగినేని బాలకృష్ణగారు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. అలాగే ట్రెండీ మూవీస్ సంస్థ చిత్రాన్ని యు.ఎస్.లో విడుదల చేస్తుంది అని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







