విజయవంతంగా ముగిసిన కైట్, స్వీట్ ఫెస్టివల్స్
- January 16, 2018
తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో కైట్, స్వీట్ ఫెస్టివల్స్ విజయవంతంగా ముగిశాయి. ఊళ్లకు వెళ్లలేని వారికి ఈ ఫెస్టివల్స్ జోష్‌ను నింపాయి. పరేడ్ గ్రౌండ్స్‌లో పతంగులు ఎగరేసి పండగ చేసుకున్నారు జనం. అటు స్వీట్ ఫెస్టివల్‌తో సరికొత్త రుచులను ఆస్వాదించారు హైదరాబాదీలు.
హైదరాబాదీలు పండుగ చేసుకున్నారు. ఓ వైపు కలర్ ఫుట్ కైట్ ఫెస్టివల్.. మరోవైపు నోరూరించే స్వీట్ ఫెస్టివల్‌తో ఒకేసారి అచ్చమైన సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సంబరాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు.. స్వీట్లు తింటూ.. గాలిపటాలను ఎగరేస్తూ ఎంజాయ్ చేశారు. 3 రోజుల పాటు సాగిన ఈ ఫెస్టివల్స్ ఘనంగా ముగిశాయి.
అటు నోటికి కి టేస్టు. ఇటు కళ్లకు ఫీస్టు. అచ్చమైన సంక్రాంతి.. పల్లె నుంచి పట్నానికి వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన కైట్ ఫెస్టివల్, స్వీట్ పండుగ.. నగరవాసులకు తెగ నచ్చేశాయి. అందుకే పరేడ్ గ్రౌండ్ 3 రోజుల పాటూ కిక్కిరిసిపోయింది. స్పాట్...
తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కలర్ ఫుల్‌గా సాగింది. దేశ విదేశాల నుంచి పతంగుల ప్రియులు తరలివచ్చారు. మూడు రోజులుగా సాగిన ఈ వేడుకలో రంగురంగుల గాలిపటాలను ఎగురవేశారు. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్థానికులు పరేడ్ గ్రౌండ్‌కు వచ్చి.. చిన్న చిన్న కైట్స్‌ను ఎగరవేశారు.
ఇక స్వీట్ ఫెస్ట్ కూడా తియ్యతియ్యగా సాగింది. ఏపీ, తెలంగాణ పిండివంటలు, బెంగాలీ రసగుల్లా, హర్యానా జిలేబీ లాంటి రెగ్యులర్ స్వీట్స్ కాకుండా.. విదేశీ తీపి వంటకాలను రుచి చూశారు. స్వీట్స్ అన్నీ హాట్ కేక్స్‌లా అమ్ముడుపోయాయి. 3 రోజుల పాటు సాగిన ఈ ఫెస్టివల్స్ మరిన్ని రోజులు పొడగిస్తే బాగుండు అని జనం అనుకున్నారు
అటు కైట్స్.. ఇటు స్వీట్స్ రెండు ఫెస్టివల్స్‌తో.. హైదరాబాదీలు నిజమైన సంక్రాంతి పండుగ చేసుకున్నారు. పండుగకు సొంతూళ్లకు వెళ్లలేని కొందరు ఇక్కడే పండుగ సంతోషాన్ని ఆస్వాదించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







