రెండో అంతస్థులోకి దూసుకెళ్లిన కారు!

- January 16, 2018 , by Maagulf
రెండో అంతస్థులోకి దూసుకెళ్లిన కారు!

కారు ప్రమాద దృశ్యాలు ఎన్నో చూసుంటారు. కానీ.. అమెరికాలో జరిగిన ఆ యాక్సిండెట్ టోటల్లీ డిఫరెంట్‌. కారు ఎగిరి.. అమాంతం ఓ భవనం సెకండ్‌ ఫ్లోర్‌లోకి దూసుకెళ్లిపోయింది. సీసీకెమెరాలో రికార్డ్‌ అయిన ఆ విజువల్స్.. ప్రమాద సమయంలో కారు డ్రైవర్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ మత్తులో.. ఒళ్లు మరిచి.. కారును ఓవర్‌స్పీడ్‌తో నడిపారు. టర్నింగ్‌ వద్ద.. కారును మలుపు తిప్పడం, బ్రేక్‌ వేయడం మరిచాడు. అదే స్పీడ్‌తో.. అలానే నేరుగా డ్రైవ్‌ చేయడంతో.. డివైడర్‌ను ఢీకొట్టి.. కారు కాస్తా విమానంలా ఎగిరింది. ఎదురుగా ఉన్న భవనం సెంకడ్‌ ఫ్లోర్‌లో దూసుకెళ్లింది. వేగంగా వస్తున్న కారు.. డివైడర్‌ను ఢీ కొట్టి.. విమానం మాదిరి గాల్లోకి ఎగిరింది. ఎదురుగా ఉన్న బిల్డింగ్‌ సెకండ్ ఫ్లోర్‌లోకి దూసుకెళ్లింది. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది.. పెద్ద పెద్ద క్రేన్‌లు తీసుకొచ్చి.. అతికష్టం మీద ఆ కారును బయటకు తీశారు. ప్రమాద తీవ్రత భారీగానే ఉన్నా.. అందులో ఉన్న ఇద్దరికి స్వల్పగాయాలు మాత్రమే అవడం విశేషం. డ్యామేజ్‌ అయిన భవనంలో ఓ డెంటల్‌ క్లినిక్‌ నడుస్తోంది. కారు దాటికి గోడ మొత్తం కూలిపోయింది. కొంత ఫర్నీచర్‌ పాడైంది. తెల్లవారుజామున ఘటన జరగడంతో హాస్పిటల్‌లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com