పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నటి అమలాపాల్
- January 16, 2018
ప్రముఖ నటి అమలాపాల్ నిన్న పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఓ కారు వ్యవహారం లో ఆమె పోలీస్ విచారణ నిమిత్తం స్టేషన్ లో సరెండర్ అయ్యారు. అసలు వివరాల్లోకి వెళ్తే నటి అమలాపాల్ కొత్తగా రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన కారును పుదేచ్చేరిలో రిజిస్టర్ చేయించుకుంది.అక్కడ రోడ్డు రవాణా శాఖ పన్ను తక్కువ ఉండడమే అందుకు కారణం.అయితే పుదుచ్చేరిలో రిజిస్టర్ చేయించుకున్న కారును కేరళాలో పన్ను కట్టకుండా నడపడంతో రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖకు నష్టం కలిగిందట. దాంతో అమలాపాల్‌పై కేరళలో సెక్షన్ 430, 468, 471 కింద కేసు నమోదు చేశారు. అయితే ఆమె ఇటీవల కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఈ కేసును తర్వాత పరిశీస్తామని చెప్పిన కోర్టు, అమలాపాల్‌ని వెంటనే క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆమె నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







