బుర్జ్ ఖలీఫాకి పోటీగా జెడ్డా టవర్
- January 17, 2018
రియాద్: ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని తలదన్నే కట్టడం మరొకటి అతి త్వరలో రాబోతోంది. బుర్జ్ ఖలీఫా కంటే 590 అడుగులు ఎక్కువ పొడవు ఉండబోతుంది. అదే సౌదీ అరేబియాలోని ఏడారి ప్రాంతంలో నిర్మితమవుతున్న జెడ్డా టవర్.
2020లో జెడ్డా టవర్‌ను ప్రారంభించనుంది సౌదీ అరేబియా. దాదాపు 1.4 బిలియన్ డాలర్ల వ్యయంతో దీన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. దీని ఎత్తు 3,280 అడుగులు(1000మీటర్లు). ఇప్పటికే 239 అడుగుల పాటు(72మీటర్లు) నిర్మాణాన్ని పూర్తి చేశారు. దుబాయ్‌లో ఉన్న బుర్జ్ ఖలీఫా ఎత్తు 2690 అడుగులు(828 మీటర్లు).
మొత్తం ఐదు కోట్ల డెబ్భై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జెడ్డా టవర్‌ను నిర్మిస్తున్నారు. కమర్షియల్ భవనాలు, హోటళ్లు, ఇళ్లు, ఆఫీస్‌లు, టూరిస్ట్‌లకు సంబంధించిన కాంప్లెక్స్‌లు జెడ్డా టవర్‌లో కొలువుదీరతాయి. సౌదీ అరేబియా ఆర్థిక నగరమైన జెడ్డాకు ఈ టవర్ మణిహారంగా మారుతుందని అంటున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







