ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు..
- January 17, 2018
తెలుగు జాతి వైభవాన్ని చాటి చెప్పింది ఎన్టీఆరే అన్నారు నందమూరి బాలకృష్ణ. తెలుగు వారి అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎన్టీఆర్ 22వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ కర్తవ్యమన్నారు. దేశం గర్వించేలా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీస్తామన్నారు బాలకృష్ణ.. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. హరికృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సహా ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను దర్శించుకున్నారు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని వక్రీకరించారంటూ విమర్శించారు లక్ష్మీపార్వతి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







