వీకెండ్‌ వెదర్‌: యూఏఈలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

- January 17, 2018 , by Maagulf
వీకెండ్‌ వెదర్‌: యూఏఈలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

ఈ వారంతంలో యూఏఈలో ఉష్ణోగ్రతలు కొంత మేర పెరిగే అవకాశం ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ పేర్కొంది. ఈ రోజు ఉదయం అత్యల్పంగా జబెల్‌ జైస్‌ మౌంటెయిన్స్‌ వద్ద 4.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ వారంతంలో ఈ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. లైట్‌ నుంచి మోడరేట్‌ తరహాలో గాలులు దేశవ్యాప్తంగా వీయనున్నాయి. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా నమోదు కానుంది. ఉదయం వేళల్లో ఫాగ్‌ / మిస్ట్‌ ఫార్మేషన్‌ని చూడవచ్చు. కోస్టల్‌ ఏరియాస్‌లో ఉష్ణోగ్రతలు 19 నుంచి 24 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదు కానుండగా, అంతర్గత ప్రాంతాల్లో 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com