రాస్ అల్ ఖైమా లో వికలాంగ ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన 500 మంది డ్రైవర్లకు జరిమానా
- January 18, 2018
రాస్ అల్ ఖైమా: గత సంవత్సరం రాస్ అల్ ఖైమాలో వికలాంగుల పార్కింగ్ స్థలంలో తమ వాహనాలను విడిచిపెట్టిన 500 మంది వాహనదారులకు జరిమానా విధించినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. .కొంతమంది 519 మంది వాహనదారులకు ఒకొక్కరికి 1 ,000 డి.హెచ్ జరిమానాని చెల్లించామని ఆదేశాలు జారీ చేశారు మరియు గత ఏడాది జూలైలో అమలులోకి వచ్చిన యుఎఇ సవరించిన ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం వారికి ఆరు బ్లాక్ పాయింట్లను వారి లైసెన్స్ లకు చేర్చారు. రాస్ అల్ ఖైమా పోలీస్ కేంద్ర కార్యాలయాల డైరెక్టర్ జనరల్ బ్రిగాడియర్ డాక్టర్ మొహమ్మద్ అల్ హుమాడి ఈ సందర్భంగా " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధితో మాట్లాడుతూ " ఎంపికచేసిన కొన్ని పార్కింగ్ స్థలాలను వికలాంగులైన ప్రజలకు అందించాలని నిర్ణయంచామని వాటిని సైతం దుర్వినియోగం చేయడం అనేది అనైతిక ప్రవర్తనగా భావిస్తామని ఆయన తెలిపారు. వికలాంగుల పార్కింగ్ స్థలాలలో వివిధ వాహనాలు, బస్సులు రవాణాకు వీలు కలిగించేవి కూడా మంజూరవుతున్నాయి. అదేవిధంగా అగ్నిమాపక వాహనాల ముందు, అంబులెన్సుల ప్రదేశములలో కొందరు వాహనదారులు పార్కింగ్ చేయడంపై పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







