త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా??
- November 22, 2015
మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ రీఎంట్రీగా చెబుతున్న 150వ సినిమా మీద ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారంటూ చాలా మంది దర్శకుల పేర్లు వినిపించగా తాజాగా మరో దర్శకుడి పేరు తెర మీదకు వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, చిరు 150వ సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ చిరుకు కథ కూడా వినిపించాడన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా ఉంటుందని భావించారు. రామ్ చరణ్ నిర్మాణంలో ఆటోజాని పేరుతో ఆ సినిమా ఉంటుందని చరణ్ స్వయంగా ప్రకటించాడు. కానీ సెకండాఫ్ కథ కుదరకపోవటంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. తరువాత వినాయక్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ సినిమా కత్తిని రీమేక్ చేస్తారన్న టాక్ వినిపించినా అఫీషియల్ గా మాత్రం ఫైనల్ కాలేదు. ప్రస్తుతం నితిన్ హీరోగా అ..ఆ.. సినిమాను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ సినిమా తరువాత చిరుతో చేయబోయే సినిమా వర్క్ మొదలెట్టున్నాడట. గతంలో చిరు హీరోగా నటించిన జై చిరంజీవ సినిమాకు కథ అందించిన త్రివిక్రమ్, చిరు నటించిన థమ్సప్ యాడ్ ను డైరెక్ట్ చేశాడు. ఇప్పటి వరకు చిరు టీం నుంచిగానీ, త్రివిక్రమ్ వైపునుంచి గాని 150వ సినిమాకు సంబందించి ఎలాంటి ప్రకటనా లేకపోయినా,అభిమానులు మాత్రం మరోసారి చిరు రీ ఎంట్రీపై చర్చించుకుంటున్నారు
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







