పారిస్‌లో అంతర్జాతీయ సదస్సు
- November 22, 2015
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఈనెల 14వ తేదీన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు మారహోమం సృష్టించిన విషయంతెల్సిందే. ఈ దాడి తర్వాత మెల్లగా కోలుకుంటున్న పారిస్ నగరం.. ఇపుడు ఓ అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యమివ్వనుంది. ఈనెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు పది రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. వాతావరణ మార్పులు, భూతాపం అంశంపై జరిగే 21వ అంతర్జాతీయ సదస్సుకు పారిస్ నగరం వేదిక కానుంది. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు దాదాపు 120 మంది ప్రపంచ అధినేతలు సైతం సిద్ధంగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి తెలిపారు. ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పలు కార్యక్రమాలు, ర్యాలీలపై దీని ప్రభావితం పడింది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఈనెల 29న నిర్వహించనున్న భారీ సన్నాహాక ర్యాలీని ఫ్రాన్స్ ప్రభుత్వం రద్దు చేసినట్లు ఐక్యరాజ్య సమితి సహాయ కార్యదర్శి జనరల్ జానోస్ తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







