డబ్బింగ్ మొదలుపెట్టిన 'కాలా'
- January 21, 2018
చెన్నై: అగ్ర కథానాయకుడు రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'కాలా'. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డబ్బింగ్‌ను రజనీ మొదలు పెట్టారు. చెన్నైలోని ఓ స్టూడియోలో ఆయన డబ్బింగ్ చెబుతున్నారు. 'కబాలి' తర్వాత రజనీ, పా రంజిత్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. ఇందులో తలైవా గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను రజనీ అల్లుడు, నటుడు ధనుష్ నిర్మిస్తున్నారు. తొలిభాగం చిత్రీకరణ ముంబయిలో, రెండో భాగం తమిళనాడులో జరిగింది. ఇందులో రజనీ భార్యగా ఈశ్వరీరావు నటిస్తున్నారు. బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషీ, నానా పటేకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
మరోపక్క రజనీ నటించిన '2.ఓ' సినిమా వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమీజాక్సన్ కథానాయికగా నటించారు.
దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
అయితే రజనీ రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో సినిమాలకు స్వస్తి పలుకుతున్నారని వార్తలు వస్తున్నాయి.
'కాలా'నే ఆయన నటించే చివరి చిత్రం అని చెప్పుకొచ్చారు. అయితే దీని తర్వాత పొలిటికల్ నేపథ్యంలో ఓ సినిమా తీయాలని, అది ప్రేక్షకులకు సందేశాన్ని ఇచ్చేలా ఉండాలని రజనీ భావిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!