అతిరధుల నడుమ ఘనంగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం

- January 21, 2018 , by Maagulf
అతిరధుల నడుమ ఘనంగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం

ముంబయి: 63వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 2017లో వెండితెరపై సందడి చేసిన పలు బాలీవుడ్‌ చిత్రాలు అవార్డులను కొల్లగొట్టాయి. ముంబయిలోని వర్లీలో జరిగిన వేడుకలకు బాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌, దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి సందడి చేశారు.

ఉత్తమ చిత్రంగా'హిందీ మీడియం' అవార్డును దక్కించుకోగా, అందులో నటనకు గానూ ఇర్ఫాన్‌ఖాన్‌ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ను సొంతం చేసుకున్నారు. 'తుమారీ సూలూ'లో రేడియో జాకీగా అలరించిన విద్యాబాలన్‌ మరోసారి ఫిల్మ్‌ఫేర్‌ను తన ఖాతాలో వేసుకుంది. 'బరేలీ కి బర్ఫీ' చిత్రానికి గానూ అశ్విని అయ్యర్‌ తివారీ ఉత్తమ దర్శకురాలిగా అవార్డును సొంతం చేసుకున్నారు.

63వ జియో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌-2018 విజేతలు

ఉత్తమ చిత్రం: హిందీ మీడియం

విమర్శకుల మెప్పు పొందిన ఉత్తమ చిత్రం: న్యూటన్‌

ఉత్తమనటి: విద్యాబాలన్‌(తుమారీ సూలూ)

ఉత్తమ నటుడు: ఇర్ఫాన్‌ఖాన్‌(హిందీ మీడియం)

విమర్శకుల మెప్పు పొందిన ఉత్తమ నటుడు: రాజ్‌కుమార్‌రావ్‌(ట్రాప్డ్‌)

విమర్శకుల మెప్పు పొందిన ఉత్తమ నటి: జైరా వాసిమ్‌(సీక్రెట్‌ సూపర్‌స్టార్‌)

ఉత్తమ దర్శకురాలు: అశ్వని అయ్యర్‌ తివారీ (బరేలీ కి బర్ఫీ)

ఉత్తమ పరిచయ దర్శకుడు: కొంకణా సేన్‌శర్మ (ఎ డెత్‌ ఇన్‌ ది గంజ్‌)

ఉత్తమ సహాయనటుడు: రాజ్‌కుమార్‌ రావ్‌(బరేలీ కి బర్ఫీ)

ఉత్తమ సహాయనటి: మెహర్‌విజ్‌ (సీక్రెట్‌ సూపర్‌స్టార్‌)

ఉత్తమ మాటల రచయిత: హితేష్‌ కేవల్య (సుభ్‌ మంగళ్‌ సావధాన్‌)

ఉత్తమ కథనం: సుభాషిశ్‌ భుటియాని (ముక్తి భవన్‌)

ఉత్తమ కథ: అమిత్‌ మస్రూకర్‌ (న్యూటన్‌)

ఉత్తమ నటుడు(లఘుచిత్రం): జాకీ ష్రాఫ్‌ (ఖుజ్లీ)

ఉత్తమ నటి(లఘుచిత్రం): షిఫాలీ షా (జ్యూస్‌)

ఉత్తమ గాయకుడు: అర్జిత్‌ సింగ్‌ (రొకే నా రుకే నైనా: బద్రినాథ్‌ కి దుల్హనియా)

ఉత్తమ గాయని: మేఘనా మిశ్రా(నాచిది ఫిరే: సీక్రెట్‌ సూపర్‌స్టార్‌)

ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య (ఉల్లూకా పట్టా: జగ్గా జాసూస్‌)

జీవిత సాఫల్య పురస్కారం: మాలా సిన్హా, బప్పీ లహరి

ఉత్తమ కొరియోగ్రఫీ: విజయ్‌ గంగూలీ, రుయల్‌ దౌసన్‌ వరిన్‌దాని (గల్తీ సే మిస్టేక్‌: జగ్గా జాసూస్‌)

ఉత్తమ నేపథ్య సంగీతం: ప్రీతమ్‌ (జగ్గా జాసూస్‌)

ఉత్తమ యాక్షన్‌: టామ్‌ స్ట్రతర్స్‌(టైగర్‌ జిందా హై)

ఉత్తమ ఎడిటింగ్‌: నితిన్‌ బైదీ (ట్రాప్డ్‌)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: పారుల్‌ సోనథ్‌ (డాడీ)

ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: అనిష్‌ జాన్‌ (ట్రాప్డ్‌)

ఉత్తమ వస్త్రాలంకరణ: రోహిత్‌ చతుర్వేది( ఎ డెత్‌ ఇన్‌ ది గంజ్‌)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com