భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఓం ప్రకాశ్ రావత్
- January 21, 2018
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. రావత్ ఈ నెల 23న నూతన సీఈసీ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం సీఈసీ గా కొనసాగుతున్న అచల్ కుమార్ జ్యోతి పదవీ కాలం రేపటితో ముగియనుంది. దాంతో ఆ పదవిని ఓం ప్రకాశ్ రావత్ తో భర్తీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1977 ఐఏఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన వారు రావత్. పలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో పని చేశారు. కాగా అయన భారీ పరిశ్రమలశాఖ సెక్రటరీగా చేసి ఇటీవల రిటైరయ్యారు. 1993లో రక్షణశాఖలో డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన రావత్ ఆ మరుసటి ఏడాది ఐక్యరాజ్యసమితి ఎన్నికలకు పరిశీలకుడిగా పని చేశారు. పలు విభాగాల్లో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ప్రధాన మంత్రి అవార్డు కూడా లభించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







