'సింగపూర్ తెలుగు సమాజం' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు
- January 24, 2018
సింగపూర్:సింగపూర్ తెలుగు సమాజం వారు ఆనవాయితీ గా నిర్వహించే సంక్రాంతి సంబరాలు, జనవరి 20 న (శనివారం) స్థానిక సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (SIFAS) ప్రాంగణం లో వీనుల విందుగా జరిగింది. సింగపూర్ లో తెలుగు సంస్కృతి , సాంప్రదాయలను పరిరక్షించడం లో ముందువుండే సింగపూర్ తెలుగు సమాజం ఈ కార్యక్రమాన్ని తెలంగాణా కల్చరల్ సొసైటీ సింగపూర్(TCSS) వారి సహకారం తో ఎంతో సాంప్రదాయబద్దం గా పండుగ వాతావరణం లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన తెలుగు వారందరికీ STS అధ్యక్షులు కోటిరెడ్డి పేరు పేరున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో సుమారు 650 తెలుగు వారు హాజరైనట్లు ఉపాధ్యక్షులు నగేష్ తెలియజేసారు . స్వచ్ఛంద సేవకులకు మరియు కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు నిర్వాహక బృందం ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసారు.
ప్రప్రథమంగా సింగపూర్ కాలమానం లో గుణించిన తెలుగు క్యాలెండెర్ ను ఆవిష్కరించారు. అంతేకాకుండా సింగపూర్ వచ్చే తెలుగువారి కోసం "స్టార్టర్ గైడ్ 1.0" ను ఆవిష్కరించారు.
హరిదాసు కీర్తనలు, యువతులతో గొబ్బెమ్మ పాటలు, బొమ్మల కొలువు వంటి కార్యక్రమాలతో సింగపూర్ తెలుగువారు చాలా సాంప్రదాయబద్దం గా జరుపుకున్నారు. మగువలకు ఉచిత గోరింటాకు, రంగవల్లుల మరియు వంటల పోటీలు, బాలబాలికల చే వివిధ ప్రతిభా ప్రదర్శనలు నిర్వహించి విజేతలకు ఆకర్షణీయమైన బహుమతుల తో పాటు ప్రశంసా పత్రాలను అందచేశారు. పిల్లలు మరియు పెద్దలు చే పాటలు, నృత్యాలు, కూచిపూడి ప్రదర్శనలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నిస్త్రాణ ప్రశ్నాగోష్ఠి ఆహుతులను అలరించింది.దంపతులకు నిర్వహించిన "చిలుకా-గోరింక" కార్యక్రమం ప్రత్యేక ఆదరణ పొందినది.
అచ్ఛమైన పండుగ పిండివంటలు, నోరూరించే తెలుగు వంటకాలతో కూడిన భోజనం స్థానిక తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకొంది.

తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







