తొలిరౌండ్ లో పసునూరి దయాకర్ ఆధిక్యం
- November 23, 2015
వరంగల్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పూర్తయింది. తొలిరౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఆధిక్యంలో ఉన్నారు. కాగా తొలిరౌండ్ పూర్తయ్యేసరికి.... టీఆర్ఎస్ 34వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది. పాలకుర్తి, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతోంది. పాలకుర్తిలో 1600, పరకాలలో 900 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకు వెళుతోంది. వరంగల్ వెస్ట్ : టీఆర్ఎస్-4,653, కాంగ్రెస్-976, బీజేపీ-496 వరంగల్ ఈస్ట్ : టీఆర్ఎస్- 5,182, కాంగ్రెస్-840, బీజేపీ-826 వర్ధన్న పేట : టీఆర్ఎస్-4,656, కాంగ్రెస్-1691, బీజేపీ-552 పాలకుర్తి : టీఆర్ఎస్-౩,401, కాంగ్రెస్-1,408, బీజేపీ- 2,496 పరకాల : టీఆర్ఎస్-6,758, కాంగ్రెస్-940, బీజేపీ-405 కాగా వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల ఈవీఎంలను ఎనుమాముల మార్కెట్ యార్డులో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఓట్లు లెక్కించడానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేయగా మొత్తం 20రౌండ్లలో లెక్కింపు కొనసాగనుంది. నియోజకవర్గంలో దాదాపు 15లక్షల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుత ఉప ఎన్నికలో 69.01శాతం ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక ఓటర్లున్న వరంగల్ పశ్చిమ స్థానంలోనే 1.2లక్షలు.. అత్యల్పంగా 48.03శాతం పోలింగ్ నమోదైంది. మిగతా సెగ్మెంట్ల విషయానికొస్తే స్టేషన్ ఘన్పూర్ 74.55, పరకాల 76.69శాతం, పాలకుర్తి 76.51శాతం, వర్ధన్నపేట 74.03శాతం, భూపాలపల్లి 70.1శాతం, వరంగల్ తూర్పు 62.21శాతం పోలింగ్ నమోదైంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







