దుబాయిలో అగ్నిప్రమాదం - మార్గంలో చిక్కుకుపోయిన వందలాది ప్రయాణీకులు
- November 23, 2015
దుబాయి లోని మురక్కాబాత్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం 5. 30 కు సంభవించిన పెద్ద అగ్నిప్రమాదం వలన, అక్కడి గ్రీన్ లైన్ ను మూసివేయడంతో వందలాది మంది ప్రయాణీకులు ఆ మార్గంలో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఒక పాత నివాస భవనాన్ని మంటలు చుట్టుముట్టిన సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసువారు భవనాన్ని ఖాళీ చేయించి, భద్రతా వలయాన్ని ఏర్పరచారు. ప్రాణ నష్టం ఏమి సంభవిoచకపోయినప్పటికీ, 48 ఫ్లాట్ లు పరశురామ ప్రీతి అయిపోవడం వలన, వారికీ నిలువనీడ లేకుండా పోయిందని వారు తెలిపారు. మురక్కాబాత్ పొలిసు ఠానా ఎదురుగా గల సలాహుద్దీన్ రోడ్డు రెండువైపులా మూసివేయడంతో, వందలాది మంది ప్రయాణీకులు ఇరుక్కుపోయి, ఇబ్బంది పడ్డారు. సంఘటనకు కారణాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







