పోలీసులు స్వాధీనం చేసుకున్న పశుమాంసం,
- November 23, 2015పోలీసులు స్వాధీనం చేసుకున్న లారీలో పశుమాంసం, ఎముకలు.. - 115 మంది అదుపులోకి - ఓల్డ్ సిటీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ - పలు చీకటి దందాలు వెలుగులోకి హైదరాబాద్: అనుమతి లేకుండా పెద్ద ఎత్తున పశుమాంసం ఎగుమతి చేస్తున్న అక్రమార్కులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్ట, కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు జరిపిన కార్డన్ అండ్ అండ్ సెర్చ్ లో పలు చీకటి దందాలు వెలుగులోకి వచ్చాయి. సౌత్ జోన్ డీసీసీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వందలాది పోలీసు సిబ్బంది.. ఇస్మాయిల్ నగర్, హఫీజ్‌బాబా నగర్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చైనా, జపాన్‌లకు పశుమాంసాన్ని అక్రమంగా ఎగుమతి చేసే కబేళా ఒకటి వెలుగు చూసింది. మూడు లారీల పశుమాంసం, ఎముకలను స్వాధీనం చేసుకుని ఆ కేంద్రాన్ని సీజ్ చేశారు. తమిళనాడులో చోరీకి గురైన వాహనాలను కొనుగోలు చేస్తున్న ఓ స్క్రాప్ దుకాణాన్ని సీజ్ చేశారు. ఎలాంటి దృవపత్రాలు లేని అనుమాస్పద వ్యక్తులతోపాటు మయన్మార్ దేశస్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 115 మందిని అదుపులోకి తీసుకున్నామని, సరైన పత్రాలులేని 90 వాహనాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర నిఘా విభాగం హెచ్చరికల నేపథ్యంలో కార్డన్ అండ్ సర్చ్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు డీసీపీ సత్యానారాయణ వివరించారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







