కత్తెరతో పేగులను కత్తిరించుకుని ఆత్మహత్య యత్నం చేయబోయిన ప్రవాస భారతీయుడు
- January 28, 2018
కువైట్: ఆత్మహత్యలలోనూ వైవిధ్యం చూపించాలని కాబోలు ఆ ప్రవాసియ భారతీయడు వింతగా విషాదంగా జీవితాన్ని ముగించాలనుకొన్నాడు. ఒక పదునైన కత్తెరతో కడుపులో బలంగా పొడుచుకొని తన ప్రేగులను తానె పర పర మని కత్తెరతో కత్తిరించుకోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆ వ్యక్తికి కల్గిన విపరీతమైన నొప్పికి విలవిల్లాడిపోయాడు ఆ బాధకు తాళలేక బిగ్గరగా వామ్మో ..వాయ్యో అంటూ పోలికేకలు పెడ్తూ అటూ ఇటూ పరుగులు పెడ్తూ రక్షించండి బాబో అంటూ ఏడుపులంకించుకొన్నాడు. బాధితుని కేకలు విన్న పోలీసులు ఆ భారతీయ వ్యక్తిని అడాన్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈలోపున ఆ వ్యక్తి కడుపు నుండి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఎంతో క్లిష్టమైన స్థితిలో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి కడుపులో ఉండిపోయిన ఒక కత్తెర జతను తొలగించి ఎట్టకేలకు రక్షించారు. అనంతరం నిందితుడిపై దర్యాప్తు నిమిత్తం అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు, ఆ భారతీయ వ్యక్తిని ఫిన్టాస్ పోలీసు స్టేషన్ లో ఉంచారు అహ్మది ప్రాసిక్యూటర్ ఆదేశాలపై నిందితుడిపై ఆత్మహత్య ఆరోపణలపై కేసు నమోదు చేయబడింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







